కాఫీ విత్..‌ఆర్ రమాదేవి పొయెట్రీ..1127-ఎ.రజాహుస్సేన్

ఆమె...అతడు…ప్రేయసీ ప్రియులు..ఒకరి మనసు ఇంకొకరికి  ఇచ్చిపుచ్చుకున్నారు.పేరుకు ఇద్దరే....
అయినా ప్రేమతో ఒక్కటయ్యారు.అలా వారి ప్రేమ ముదిరిపాకానబడింది.ఇక లోకంతో పనిలేదు.ఇద్ద
రూ ఒక్కటై ప్రేమలో నిండా మునిగారు.

ఇప్పుడు …వారి మధ్య కొంతగ్యాప్ వచ్చిందేమో? పొరపొచ్చాలు పొడసూపి,అవగాహన కొరవడిందేమో? ఆమెకు అతగాడి మీద కోపం వచ్చింది(ప్రేమ
లోకోపతాపాలు,పరితాపాలుసహజమే) కోపమంటేఅలాంటిలాంటి కోపంకాదు..అదేంటో తెలుసుకునే ముందు మీరూ ఓ సారి ఈ కవిత చదవండి..

“అతని మీద అలవి కాని కోపం వచ్చింది
నా మనసును అతనింటి కొక్కానికి తగిలించొచ్చాను
అతను చూశాడో లేదో
మదిలో ఆరాటం మొదలయ్యింది
మనసు నాదే... నొప్పి అతనిది
కర్కశ హృదయురాలినే అపుడపుడు”!
*ఆర్.రమాదేవి..!!

ఇప్పడు అతగాడిపై ఆమె కోపానికి కారణమేంటో తెలీదు కానీ, మొత్తానికి అలవికాని, పట్టరానంత కోపం వచ్చింది. ఇకనేం అతగాడి ఇంటికెళ్ళి,తన
మనసును అతనింటి కొక్కానికి తగిలించి వచ్చేసింది…వచ్చాక నుంచి ఒకటే అంతర్మథనం.‌అతగాడు కొక్కేనికి వేలాడుతున్న తన మనసును చూశాడా? చూడలేదా? ఒకవేళ చూస్తే అతడి పరిస్థితేమిటి? తట్టుకోగలడా? అంతశక్తి అఅతగాడికి
వుందా? ఒకవేళ చూడక పోతే? అవును చూడక పోతేనే బావుణ్ణు.కనీసం అతగాడైనా స్థిమితంగా
వుంటాడు..చూసి బాధపడేకంటే చూడకుండా వుంటేనే నయంకదా!
ఆమె మదిలో ఒకటే ఆరాటం.‌.
లోపల తనతో తానే పోరాటం
అసలు విషయమేమంటే…
మనసు తనదే... కానీ నొప్పి అతనిది కదా!

అయినా తనదెంత  ‘  కర్కశ హృదయం….’.ఎప్పుడూ కాకున్నా,…అపుడపుడు ఇలానే
ప్రవర్తిస్తుంటుంది..అప్పుడు అతగాడు ఎంత బాధపడి వుంటాడో కదా? ఎంత క్షోభను అను
భవించి వుంటాడో? తలుచుకుంటే..తనెంతకఠినురాలో,కర్కశురాలో అర్ధమైంది.‌..

ఈ కవిత గొప్పదనమంతా..ఆమె మనసును కొక్కానికి వేళ్ళాడదీసి రావడంలోనేవుంది..అతడిపై ఆమె
కు కోపం వచ్చింది..దానికి ప్రతిగా ఆమె మనసుఅతడి ఇంట్లో కొక్కేనికి తగిలించింది.అంటే నా దగ్గరున్నమనసు నీకే ఇచ్చేశానన్న మెసేజ్ అతగాడికి పంపింది.

అంతా బాగానే వుంది కానీ…
అసలు తన దగ్గరున్న మనసు తనది కాదు..
అతగాడిదే.,‌ఇద్దరు ప్రేమలో ఒకటయ్యాక…
ఒకరిమనసు ఇంకొకరు ఇచ్చిపుచ్చుకున్నాక
తన మనసు అతగాడిదగ్గర,అతడి మనసు..
తనదగ్గరా వుంది..తీరా కొక్కేనికి తగిలించాక
గానీ ఈ విషయం ఆమెకు గుర్తురాలేదు.అతడి
మనసును  తిరిగి ఇచ్చే స్తే(వాపసు చేస్తే…)అత
గాడి వద్దనున్న తన హృదయం పడే నొప్పిని అత
గాడే భరించాలి కదా!
ప్రియా….,
నన్ను క్షమించు…!
నేను కోపిష్టిని
పాపిష్టిని…
కఠినురాలిని
కర్కశురాలిని
అయినా…
నీ ప్రేమికురాలిని.!
క్షమించవా! ప్లీజ్ !
అంటూ లోలోనే కుమిలి పోయింది.
ఇంతకూ…..
అతగాడు
కొక్కేనికి వేలాడదీసిన ఆమె మనసును
చూశాడా? లేదా?
చూస్తే….
అతగాడి రియాక్షన్ ఏమిటి?
ఆమె కోపాన్ని అర్ధం చేసుకొని
ఆమెను లాలించాడా?అనునయించాడా?
బతిమిలాడాడా? బామాలాడా?
ఒకవేళ చూడకుంటే ఏమైంది..?
ఆమె మనసు ఆ కొక్కేనికే వేలాడుతోందా?
తన తప్పును తెలుసుకొని,ఆమె తన మనసు
ను వెనక్కి తెచ్చుకుందా!
ఇలాంటి ప్రశ్నలకు సమాధానలను
పాఠకుల ఊహకే వదిలేశారు కవయిత్రి..
ఆర్.రమాదేవి..!
*ఎ.రజాహుస్సేన్..!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!